![]() |
![]() |

సోషల్ మీడియా జపాన్ నుంచి ఫుట అనే పర్సన్ ఫుల్ ఫేమస్. అలాంటి ఫుట జపాన్ లో ఉంటూ తెలుగు భాషలో అందమైన తెలుగు వీడియోస్ చేస్తూ ఉంటాడు. అలాంటి జపాన్ ఫుట బిగ్ బాస్ తెలుగుకి వెళ్లాలని అనుకుంటున్నట్టు ఒక ఆడిషన్ వీడియో పంపించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నమస్కారం అందరికీ నా పేరు ఫుటా. జపాన్ నుంచి వచ్చాను. నేను 7 ఇయర్స్ అమెరికాలో ప్రొఫెషనల్ డ్రమ్మర్ గా పని చేసాను. నా లైఫ్ లో మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్.
అమెరికాలో ఉన్నప్పుడు తెలుగు స్టేట్స్ నుంచి వచ్చిన కొంతమంది ఫ్రెండ్స్ ని కలిసాను. అందుకే ఇప్పుడు వాళ్ళతో క్లోజ్ అయ్యాను. అప్పుడే తెలుగు బాషా మీద, తెలుగు కల్చర్ మీద చాలా ఇంటరెస్ట్ వచ్చింది. అప్పటి నుంచి తెలుగు నేర్చుకోవడం స్టార్ట్ చేసాను. నిజం చెప్పాలంటే తెలుగు బాషా కంటే ముందు తెలుగు ప్రజల నా మనసును దోచుకున్నారు. అమెరికాలో నేను సింగల్ ఉన్న టైములో తెలుగు వాళ్ళు నన్ను ఫామిలీ మెంబర్ లాగా చూసుకున్నారు. నాకు సపోర్ట్ చేశారు. నాకు వంట చేసి పెట్టారు. చాలా చాలా ప్రేమ చూపించారు. నా గోల్ సింపుల్. తెలుగు వాళ్ళు ఇచ్చిన ప్రేమకు కొంచెం అన్నా రిటర్న్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చాల వర్క్ చేస్తున్నాను. తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగు స్టేట్స్ లో తిరుగుతున్నాను. రాజమండ్రి విజయవాడ ప్రాంతాలను చూసాను.
చాలామంది తెలుగు ఫ్రెండ్స్ ని కలుస్తున్నాను. బిగ్ బాస్ తెలుగులో పార్టిసిపేట్ చేయడం నా డ్రీం. ఎందుకంటే ఇది ఒక రియాలిటీ షో మాత్రమే కాదు తెలుగు వాళ్లకు ఇంకా దగ్గరయ్యే గొప్ప అవకాశం. నేను ఫారెనర్ ఐనా నా మనసులో తెలుగు కల్చర్ కి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. ఫ్యూచర్ లో పెద్ద నటుడిని కావాలని నా కల. ఇండియన్ సినిమాలో ప్రత్యేకంగా తెలుగు సినిమాలో వర్క్ చేయాలనీ కోరుకుంటున్నాను. నాకు తెలుగు ఇంకా పర్ఫెక్ట్ గా రాలేదు. కానీ నేను నిజాయితీగా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేను తెలుగు నేర్చుకుంటున్నాను. నేను ఎంటర్టైన్ చేస్తాను. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే నా బెస్ట్ ఇస్తాను. లవ్ యు ఆల్ జై తెలుగు " అంటూ బిగ్ బాస్ తెలుగు 10 కి తాను పంపించిన తెలుగు ఆడిషన్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఐతే తానూ బిగ్ బాస్ అగ్నిపరీక్షకు సెలెక్ట్ ఐనట్లు పోస్ట్ చేసుకున్నాడు. ఐతే ఎలా అలరిస్తాడు అనేది వేచి చూడాలి.
![]() |
![]() |